14 02 2024 01

కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు.

నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గారి సమక్షంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా ఈ కార్యక్రమ పరిశీలనకు వచ్చిన ఆ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి రాహుల్ కొటారి జీ మరియు ముఖ్యమంత్రి బృందానికి ప్రత్యేక స్వాగతం పలికి, రేపటి కార్యక్రమం ఏర్పాటును ప్రత్యేకంగా పరిశీలిస్తూ దగ్గరుండి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బీరప్ప బేజాడి గారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలలోనే రెండో శ్రీశైలంగా పేరుగాంచిన, భక్తుల పట్ల కొంగు బంగారం అయిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నూతన రైల్వే లైన్ తో పాటు స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల దేవాలయం అభివృద్ధి తో పాటు పర్యాటకంగా ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కాబట్టి రేపటి కార్యక్రమానికి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Comments

2 responses to “కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం”

  1. P Mahesh Avatar
    P Mahesh

    Good information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *