17 02 2024 03

ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

Spread the love

వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ… “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటీవల కమలదళంలో చేరిన వడ్డేపల్లికి చెందిన కార్పొరేటర్ శ్రీ డా.దాస్యం అభినవ్ భాస్కర్ గారికి అండగా ఉండేందుకు వడ్డేపల్లి వాసులు నేడు బిజెపిలో చేరిన సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఇటీవల నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితుడై ఢిల్లీలో బిజెపిలో చేరిన యువ నాయకుడు, అభినవ్ భాస్కర్ కు మీరంతా అనాడు మహనీయులు స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ కు ఎలా అయితే అండగా ఉన్నారో అలాగే ఉండి నగరంలో బీజేపిని అధికారం వైపు నడిపించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను.

దేశంలో మూడోసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కొలువుదీరనుందని కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీకి ఓటేసి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతున్నాను.”

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శ్రీ రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ మంద ఐలయ్య, ఉమ్మడి వరంగల్ పూర్వ అధ్యక్షులు శ్రీ వంగాల సమ్మిరెడ్డి, జమ్మికుంట జెడ్పిటిసి శ్రీ శ్రీరాం శ్యాం, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ పిట్టల కిరణ్ గార్లు తదితరులు పాల్గొన్నారు

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *