images 78

ఓవైసీకి భయపడే KCR తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపట్లే: కిషన్ రెడ్డి ఫైర్

Spread the love

ఓవైసీకి భయపడే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం చేయడంలేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమం సందర్భంగా ఇవాళ కవాడిగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలవక ముందు కేసీఆర్ అధికారకంగా నిర్వహిస్తామం అన్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పారని అన్నారు.

మనకు నిజాం నియంతృత్వం నుంచి విమోచనం జరిగిన రోజు నాడు మనం ఉత్సవాలు కూడా జరుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన ప్రాంతం ఉందన్నారు. ఈ సారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామన్నారు.