20240118 110432

హనుమాన్ మూవీ హీరో తేజను సన్మానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Spread the love

సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హనుమాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జ కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి కిషన్ రెడ్డి తేజను శాలువతో సత్కరించారు. అలాగే సినిమా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో పాటుగా భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్న ఈ సినిమా.. అమ్ముడుపోయిన ప్రతి టికెట్ పై ఐదు రూపాయలు అయోధ్య రామమందిరానికి ఇస్తామని మూవీ టీమ్ ప్రకటించిన క్రమంలో కిషన్ రెడ్డి వారి నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అలాగే ప్రతి టికెట్ పై ఐదు రూపాయలు ఇచ్చి హనుమాన్ మూవీ టీమ్ అయోధ్య నిర్మాణంలో ప్రారంభోత్సవంలో బాగాస్వాములయ్యారిన తన ట్విట్టర్ వేదికగా మంత్రి రాసుకొచ్చాడు. కాగా ఈ నెల 12 రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఐదు రోజులు వంద కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లనే రాబట్టింది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *