06 09 2023 Meri Maati Mera Desh Kishan Reddy scaled

ప్రపంచాభివృద్ధి కోసం సమగ్ర రైలు, షిప్పింగ్ కనెక్టివిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Spread the love

ప్రపంచాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సమగ్ర రైలు, షిప్పింగ్ కనెక్టివిటీ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం జీ 20. సమావేశాల సందర్భంగా ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా, యురోపియన్ యూనియన్, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, ఇతర ఇస్లామిక్ దేశాలను కలుపుతూ సాగే సమగ్రమైన . రైలు, నౌకాయాన (షిప్పింగ్) కనెక్టివిటీ నెట్వర్క్ సున్నా జీ 20 సమావేశాల్లో ప్రకటించడం అంతర్జాతీయ అనుసంధానతలో గొప్ప మలుపుగా అయన అభివర్ణించారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, పర్యాటక రంగాల పాత్రను అందించేందుకు గాను జీ 20 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయని తెలిపారు. సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు.. ఆ విలువైన సంస్కృతిక వస్తువులను.. తిరిగి సంబంధిత దేశాలకు అప్పగించే విషయంలోనూ న్యూఢిల్లీ డిక్లరేషన్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. సంస్కృతి, సాంస్కృతిక వారసత్వం రక్షణతో పాటుగా ప్రచారం విషయంలో.. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కూడా న్యూఢిల్లీ డిక్లరేషన్ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

భారత్ నేతృత్వం వహించిన జీ-20 సమావేశాలు.. 21వ శతాబ్దిలో అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ సమావేశాలుగా నిలిచిపోతాయని ఆయన అన్నారు. ఆఫ్రికన్ యూనియన్కు జీ-20లో స్థానం కల్పించడం.. దీనికి సభ్య దేశాలు అన్ని ఆమోదం తెలపడం ‘గ్లోబల్ సౌత్’ గొంతుక వినిపించడంలో భారతదేశ అంకిత భావానికి నిదర్శనమన్నారు. వచ్చే రెండేళ్ల పాటు జీ20 (ఆఫ్రికా యూనియన్ చేరిన తర్వాత జీ21గా మారింది. సమావేశాలను నిర్వహించనున్న బ్రెజిల్, ఆ తర్వాత దక్షిణాఫ్రికా దేశాలు.. ‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్’ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాయని.. తెలిపారు. ఈ సమావేశాల్లో యావత్ ప్రపంచ సమగ్ర, సంపూర్ణాభివృద్ధి కోసం ఏకాభిప్రాయంతో, పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయాల సంతృప్తితో.. వచ్చే ఏడాది జీ20 సమావేశాలను నిర్వహించనున్న బ్రెజిల్కు జీ20 నేతృత్వ బాధ్యతలను భారత్ అప్పగించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.