నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 24 గంటల దీక్ష మరి కాసేపట్లో ముగియనుంది. బుధవారం ఇందిరాపార్కు వద్ద కొనసాగుతున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం పార్టీ కార్యలయానికి చేరుకొని రాత్రి నుంచి దీక్ష కొనసాగిస్తున్నారు. కాసేపట్లో 24 గంటలు ముగియనుండటంతో దీక్ష ముగించనున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబంలో అందరికీ లక్షలు దండుకునే ఉద్యోగాలు వచ్చాయి కానీ, రాష్ట్ర యువత మాత్రం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప గాయాలు
by