వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 33 వ డివిజన్ S.R.R తోట ప్రాంతంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ (BJP) కార్యక్రమంలో భాగంగా పర్యటించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు.


ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 9 ఏండ్ల పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్దిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నదని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తమ ఘనతే అన్నట్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు.


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. “ఆయుష్మాన్ భారత్ పథకం” ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. మహిళా సాధికారత కోసం మహిళా బిల్ కూడా అమలు చేసిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిదే అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పారు. ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేక పోయిందని చెప్పారు. కనీసం చిన్న చిన్న కుటీర పరిశ్రమలను తీసుకువచ్చినా మహిళలకు ఉపాధి లభించేదనీ, యువతకు జీవనోపాధి కలిగేదనీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించేవని అన్నారు.


ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే తన నియోజక వర్గ ప్రజల కోసం ఏమీ చేయలేకపోవడం అతని అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మందా శ్రీనివాస్, చిలువేరు రాజేందర్, ముద్దసాని కృష్ణ, పాలమూరు భిక్షపతి, పాలకుర్తి శేఖర్, జిలకర్ర ఇరస్వామి, శ్రీరామేజు ప్రదీప్, వనం కార్తిక్, గాజుల రజీని , ఓడపెల్లి వీరన్న, దుస్సా శివ తదితర బీజేపి నాయకులు, కార్యకర్తలు, పార్టి శ్రేణులు పాల్గోన్నారు.