IMG 20240301 WA0033 scaled

జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్

Spread the love

ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ

ఇప్పుడు మహిళలు అన్నిటా ముందు ఉంటున్నారు.
అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ టీచర్, వడ్ల కొనుగోలు సెంటర్లు, ఆశ వర్కర్స్ ఇలా ఎక్కడ చూసినా ప్రజలకు సేవలు అందించడంలో మహిళలు ముందున్నారు.
ఆ ఆడబిడ్డలకు చట్టాలు చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో 33 శాతం రిజర్వేషన్ కలిపించారు మన ప్రధాని నరేంద్ర మోదీ.
మనరాష్ట్రంలో మూడవ వంతు మహిళలు అంటే 119 మందిలో 40 మంది, 17 మంది ఎంపీలలో 5/6 మంది మహిళలు ఎంపీలు కాబోతున్నారు.
సఫాయి కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మనకు శుభ్రత అందిస్తున్నారు వారికి కాళ్లుకడిగి గౌరవించిన వారు నరేంద్ర మోడీ.
కరోనా సమయంలో టాయిలెట్ కడిగి, ఫ్లోర్ కడిగి సాఫ్ చేసిన వారు పేదవారు. అలాంటివారిని గుర్తించాలి అని వారి కాళ్లు కడిగి గౌరవించారు.
ఈదేశంలో అనేకమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఒక పేద కుటుంబం నిండి వచ్చారు కాబెట్టే మోదీ ఇవన్నీ చేయగలిగారు.
కరోనా సమయం నుండి 5 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు.
కేసీఆర్ ఇచ్చినవన్నీ నేను ఇస్తున్న అని చెప్పుకున్నారు కానీ మోడీ గారు ఎప్పడు నేను ఇస్తున్న అని చెప్పుకోలేదు. నేను మీ సేవకుడిని అని చెప్పుకున్నారు.

కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ పదవులు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలు కాదు అని మీరంతా భావించారు కాబట్టే మొన్న గుద్దుడు గుద్దితే కేసీఆర్ దిమ్మ తిరిగింది.
కానీ మోదీ గారికి కుటుంబం లేదు 140 కోట్ల ప్రజలే ఆయన కుటుంబం.

దేశంలో 4 కోట్ల ఇల్లు కట్టించారు. కానీ కేంద్రం డబ్బులు ఇస్తున్నా తీసుకోకుండా పేదవాడి ఇంటి కలను దూరం చేసినవాడు కేసీఆర్
ఎంపీ ఎన్నికల్లో గెలిపించండి పేదవాడి ఇంటి కల నిజం చేస్తాం.

50 కోట్ల మందికి అకౌంట్ ఓపెన్ చేసిన బిడ్డ మోదీ.

ప్రతి పేదవాడికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాయి అందుకే నా దేశంలో ఉన్న ప్రతిఒక్కరు ఈ సారి మా ఓటు మీదీ గారికి అంటున్నారు.
భారత దేశం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉంది.
ఒకప్పుడు లాగా బాంబులు పేలుతాయనే భయం లేదు, మత విద్వేషాలు లేవు.
బుల్లెట్ గాయాలతో బాధపడే సైనికులు లేరు.

ఒకప్పుడు రైల్వే స్టేషన్ లు పందికొక్కులతో మురికి వాసనతో ఉండేవి. కాని ఈరోజు ఎయిర్పోర్ట్ లాగా తయారయ్యాయి.

అందుకే మొదటి సారి 273 సీట్లు ఇస్తే రెండవసారి 303 సీట్లతో ఆశీర్వదించారు.
రేపు 375 సీట్లు ఇచ్చి ఆశీర్వదించండి అని కోరుతున్నాం.

కాంగ్రెస్ వారు హామీలు ఇచ్చి కనిపించడం లేదు.
4 వేల పెన్షన్ తెల్లారి నుండే ఇస్తా అని రేవంత్ చెప్పాడు. ఇస్తున్నాడా?
మాకు ఓటు వేస్తే ముక్కు పిండి మీకు ఇప్పిస్తాం.
2 లక్షల రూపాయల రుణమాఫీ గల్లా పట్టి అడిగే జిమ్మేదార్ మాది.
మహిళలకు 2500 వచ్చేవరకు కొట్లాడతాం.
ఇచ్చినవాడు మొఖం చాటేస్తే గల్లా పట్టి అడుగుతాం.
హామీలు అమలు చేయకుండా మోసం చేస్తే మీ తరఫున కొట్లాడతాం.
ఇదే కాకుండా కేంద్ర పథకాలు అన్నీ మీకు అందేలా చూసే భాద్యత్తమాది.
ఉపాది హామీ డబ్బులు నేరుగా మీ అకౌంట్ లో పడుతున్నాయి.
10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకువస్తాం.

మాదిగ జాతి, వాటి ఉపకులాలు నష్టపోతున్నాయని 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ ఆద్వర్యంలో 30 ఏళ్లుగా ఉద్యమం నడిస్తుంది. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. గాంధీ భవన్ ఘటనలో ముగ్గురు పెట్రోల్ మంటల్లో కాలి పోయారు.
అయినా ఏ పార్టీ కూడా వారి సమస్యలు తీర్చలేదు… మేము తీరుస్తామని మోదీ హామీ ఇచ్చారు.
అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాదిగ జాతి మా ఆశీర్వాదం నరేంద్రమోదీకే అని చెప్తున్నారు.
పేదల పక్కన ఉండే పార్టీ, అణచివేతకు గురి అయ్యేవారిని ఆదుకుంటున్న పార్టీ బీజేపీ అని వారే అంటున్నారు.

ఒకప్పుడు ఎరువుల కోసం మనం లైన్లు కట్టేది.. 6300 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం ఓపెన్ చేసి ఎరువుల కోరత లేకుండ చేసారు.
500 కోట్లతో కాజీపేటలో రైల్వే వాగన్ ఫాక్టరీ పెట్టి మనకు ఉపాధి కల్పించబోతున్నారు.
ప్రతి రైతుకు 6 వేల రూపాయలు అందిస్తున్నారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా 5లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు.
దీన్ని 10 లక్షలు చేయబోతున్నారు.

పెదప్రజలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న, దేశాన్ని సుభిక్షంగా, సురక్షితంగా ఉంచుతున్న భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి సేవ చేసే భాగ్యం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఈటల రాజేందర్ అన్నారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *