అమరవీరుల స్మరణలో, ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా జరుగుతున్న హైదరాబాద్ విమోచన వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేసే క్రమంలో..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర మొదలై, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, హనుమకొండ వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు బైక్ యాత్ర ఇవాళ చేశారు.
అనంతరం పరకాలలో తెలంగాణ విమోచన దినోత్సవానికి మద్దతుగా వేల సంఖ్యలో తరలివచ్చిన వారితో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర నాయకులు శ్రీ ఈటెల రాజేందర్ గారు & సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్నారు
తెలంగాణ ను నిజాం పాలన నుండి విముక్తి చేయడానికి పరకాల పోషించిన పాత్రను, అమరవీరుల త్యాగాలను వివరించి.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న జరగనున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రజలను కోరారు.
త్రివర్ణ పతాకాలు, బీజేపీ జెండాలతో రోడ్లన్నీ రంగులమయం చేసి..బీజేపీ కార్యకర్తలతోపాటు యువత స్వచ్ఛందంగా వాహనాలతో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేశారు.