కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు దేశ రాజధాని కొత్త డిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి గారి సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు:
- బీఆర్ఎస్ కాంగ్రెస్ బీ టీమ్ కాకపోతే ఓటు కు నోటు కేసులో దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎందుకు శిక్ష పడట్లేదు?
- కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలన కారణంగానే.. నాడు 1969లో.. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో వేల మంది తెలంగాణ విద్యార్థులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
- పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి.. తెలంగాణకోసం ఏం చేశారో చర్చించేందుకు వచ్చే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా?
- హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు వస్తారో.. ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో చర్చిస్తారో మీరే నిర్ణయించండి.. మేం సిద్ధమే.. మీరు రెడీనా? వీటన్నింటికంటే ముందు..
- హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయం ముందు ముక్కు రాసి.. తెలంగాణ సమాజానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి.