18 09 2023 Mahila Bill

కేంద్ర బీజేపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

Spread the love

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో, లోక్ సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ముఖ్యమైన నిర్ణయం భారతదేశ రాజకీయ దృశ్యంలో లింగ సమానత్వం వైపు ఒక ముఖ్యమైన మలుపుగా అభివర్ణించవచ్చు.

27 సంవత్సరాల క్రితం సెప్టెంబరు 1996లో దేవెగౌడ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు, ఆమోదం పొండానికి రాజకీయ సంకల్పం మరియు ఏకాభిప్రాయం లేకపోవడంతో బిల్లు అమలుకు రెండు దశాబ్దాలుగా నోచుకోలేదు.

సోమవారం సాయంత్రం జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో, మహిళా రిజర్వేషన్ బిల్లు ముసాయిదాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు లోక్ సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు సీట్ల రిజర్వేషన్ ను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది రెండు దశాబ్దాలుగా పూర్వ ప్రభుత్వాలకు సాధ్యంకాని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవతో మరియు మహిళలు పోరాట స్పూర్తితో సాధించిన విజయం.

ముసాయిదా బిల్లు ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేక సెషన్ లో పరిశీలన మరియు ఆమోదం కోసం పార్లమెంటు ఉభయ సభలలో సమర్పించబడుతోంది.


Posted

in

by