ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఈటల మీడియాతో మాట్లాడారు. నడుమంత్రపు సిరిలాగా.. అనూహ్యంగా ము ఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇటీవలే ప్రధాని మోదీని పెద్దన్న అని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుం దని చెప్పి.. ఇప్పుడేమో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని అన్నారు. మొదట కేసీఆర్ కూడా ఇలాగే వ్య వహరించాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని.. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చె బుతారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు విమర్శలు చేసి.. ఇప్పుడు మీరు కూడా ట్యాపింగు పాల్పడుతున్నట్లు తెలు స్తోందని అనుమానం వ్యక్తం చేశారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్టు రేవంత్ రెడ్డి వ్యవహా రం ఉందని ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుంది. ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావు. నిన్ను గమనించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు’ అని హితవు పలికారు. మల్కాజ్గగిరిలో బీజేపీ జెండా ఎగిరేసి తీరుతా అని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు
by
Tags:
Leave a Reply