బిజెపి 24 గంటల దీక్ష కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ..
నీళ్లు ఎవరికి వచ్చినయ్..? ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చినాయి..
నిధులు..? ప్రగతి భవన్ కి వచ్చినాయి.. నియామకాలు..? కల్వకుంట్ల కుటుంబానికి వచ్చినయ్.. తెలంగాణకు వచ్చినై గుండు సున్నా.. నిరుద్యోగులకు వచ్చింది గుండు సున్నా.. అని అన్నారు.
కెసిఆర్ గవర్నమెంట్ “శాంపిల్ గవర్నమెంట్”. దళిత బంధు “శాంపిల్”. డబల్ బెడ్రూం ఇల్లు “శాంపిల్”. ఉద్యోగాలు “శాంపిల్”. బీసీలకు లక్ష బిక్ష “శాంపిల్”. అన్నీ.. శాంపిలే… ఏది ఫుల్ ఉండదు. కేవలం కుటుంబానికి తప్పితే..
ఈరోజు కేసీఆర్ కేవలం పోలింగ్ బూత్ కే భయపడతాడు. మనం కేసీఆర్ ను గద్దతించాలంటే తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు పోలింగ్ బూత్ లో దెబ్బ కొట్టాలి. మనం చేయాల్సిన పని పోలింగ్ బూత్ లో.. మనం దెబ్బ కొట్టాల్సింది పోలింగ్ బూత్ లో..
లేకపోతే మూడోసారి అవకాశం ఇస్తే మాత్రం కెసిఆర్ బస్మాసురునిలా తెలంగాణను మొత్తం భక్షిస్తాడని తీవ్రంగా విమర్శించారు.
ఉద్యోగాలు రావాలంటే బీజేపీ రావాలి, ఉపాధి రావాలంటే బీజేపీ రావాలి , స్వయం ఉపాధి రావాలంటే బీజేపీ రావాలి – నిరుద్యోగులకు అండగా బీజేపీ, భవిశ్యత్తుకు భరోసా బీజేపీ అని తెలిపారు.
ఇలాంటి సమర దీక్ష 2013 27,28 లో తెలంగాణ జాయింట్ ఆక్షేన్ కమిటీ తరుపున జరపడం జరిగింది.. అప్పుడు కెసిఆర్ గారు కూడా రావడం జరిగింది. సమైక్య ఆంధ్రలో ఎలాంటి నిర్బంధాలు లెవు, కానీ ఇప్పుడు ఎన్ని నిర్బంధాలో… ఇలా, మల్లీ ధర్నా చౌక్ లో ధర్నా చేయవలసి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు.
కెసిఆర్ మోడల్ చుక్క, ముక్క రుక్కం . మరి మన మోడీ గారి మోడల్ దేశం, ధర్మం, డెవలప్మెంట్ అని సభాముఖంగా తెలిపారు.
దేశ, రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ పై అధిపత్యం సాధించాలని తెలిపారు.