బిజెపి ఇందిరాపార్క్ ఉపవాస దీక్ష కార్యక్రమంలో జి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ..
గత 9 సంవత్సరాల క్రితం, తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ యువత గిరిగిసి పోరాటం చేసింది. తెలంగాణ నిరుద్యోగ యువత ఈ తెలంగాణ వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుందేమో అని ఏ మాత్రం ప్రాణాలు లెక్కచేయకుండా 1200 మంది బిడ్డలు బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మా బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర.
మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర హారంగా వచ్చు, వంటావార్పు కావచ్చు ఇదే ధర్నా చౌక్ లో సంవత్సరాల తరబడి, నెలల తరబడి, నిరుద్యోగ యువకులు తెలంగాణ ప్రజలు, తెలంగాణ కోసం పోరాటం చేశారు.
కానీ ఏమైంది..? తొమ్మిది సంవత్సరాలుగా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ.. ఈ రోజు పేరు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ, సంవత్సరాల తరబడి ఉద్యోగాలు ఇవ్వకుండా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించకుండా.. వాయిదాల మీద వాయిదా వేసి, కోర్టు కేసుల పేరుతో.. నోటిఫికేషన్ లు రద్దుచేస్తూ.. ఒక పథకం ప్రకారము నిరుద్యోగ యువతను మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం.
కేసీఆర్ యొక్క చేతకానితనం కారణంగా.. పరీక్ష పత్రాలు లీకై, లక్షలాదిమంది నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డున పడ్డారు.
ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పరీక్షలు రాస్తే.. అప్పులు చేసి, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకుంటే… మీరాలని ఈరోజు గాలికి వదిలేసావే. వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి..?
నిరుద్యోగ యువతకై పోరాటం చేస్తే మా అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద కేసులు పెట్టావు.
సిగ్గుండాలి మీ ప్రభుత్వానికి. కొంతైనా ఇంగిత జ్ఞనం ఉండాలి. చేతకానితనం నీది, అవినీతి కుంభకోణాలు మీవి, కేసులు మా మీద పెడతారా…? అని కెసిఆర్ మరియు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Leave a Reply