సికింద్రాబాద్‌లో పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరగనున్న సెప్టెంబర్ 17 కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన BJP రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి గారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఇదే పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాం.
- తెలంగాణ స్వాతంత్ర్యానికి 75 ఏండ్ల అమృత్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. కాబట్టి ఈ సంవత్సరం కూడా చేయాలని ప్రధాని మోడీ ఆదేశించడంతో ఈ ఏడాది కూడా విమోచన ఉత్సవాలు చేస్తున్నాం.
- ప్రభుత్వాల ఆధ్వర్యంలో దీనికి గుర్తింపు రావాలని, తెలంగాణ సమాజం నుంచి ఒత్తిడి వస్తున్న విషయం మీకు తెలుసు
- దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు.
- అందుకే ఈ ఏడాది కూడా గత ఏడాది లాగే ఎంతో వైభవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
- హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు.
- ఈ కార్యక్రమంలో పారామిలటరీ ద్వారా పరేడ్ కవాతులు ఉంటాయి. ఇందులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, కోబ్రా లాంటి పారామిలిటరీ దళాల కవాతు ఉంటుంది.
- అప్పటి హైదరాబాద్ స్టేట్‌లో భాగమైన కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలుకు చెందిన కళాకారుల నుంచి విమోచన ఉత్సవాలకు ఆహ్వానించాం. గ్రామీణ కళారూపాలను ఈ వేడుకల్లో ప్రదర్శించబోతున్నారు.
- నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల కుటుంబ సభ్యులను కూడా వేడుకలకు పిలిచి, సన్మానించబోతున్నాం.
- హైదరాబాద్ లిబరేషన్‌కు సంబంధించి నిజాం పాలనలో పోరాటాలు, ప్రజల కష్టాలపై భారత ప్రభుత్వం, కల్చరల్ శాఖ ద్వారా ఒక వర్చువల్ ఎగ్జిబిషన్ ప్రదర్శించబోతున్నాం.
- నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రముఖ పాత్రికేయుడు.. షోయబుల్లాఖాన్ పేరు మీద భారత ప్రభుత్వం రేపు ఒక పోస్టల్ కవర్ విడుదల చేయబోతున్నది.
- ప్రముఖ గిరిజన రామ్‌జీ గోండు పేరు మీద కూడా.. ఒక పోస్టల్ కవర్స్ విడుదల చేయబోతున్నాం.
- ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా.. హైదరాబాద్ చుట్టు పక్కల ఉండే దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందించబోతున్నాం.
- నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేశారో.. వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా భారత ప్రభుత్వం విమోచన దినోత్సవాలు జరుపుతున్నది.
- తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియకుండా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది. వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి.
- భారత సైనికులు నిజాంను ఓడించి, ఈ గడ్డపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన రోజును అందరూ గుర్తుంచుకోవాలి. ఈ రోజును భారతప్రభుత్వం ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేయడం మనకు గర్వకారణం.
- భారత ప్రభుత్వ అధికారిక లిబరేషన్ కార్యక్రమంపై.. పోలీసులు పార్టీ మీటింగ్ లాగా సర్క్యులర్ జారీ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సర్క్యులర్ జారీ చేసిన పోలీసులు వెంటనే క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
- ఎలాంటి చట్టం లేకున్నప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేసింది. రాజ్యాంగబద్ధ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ సెప్టెంబర్ 17 నాడే నిర్వహిస్తున్నది.
- తెలంగాణ అమరుల మీద గౌరవం ఉండి ఉంటే.. కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17న వర్కింగ్ కమీటీ పెట్టేది కాదు.
- ఏ రోజూ కూడా హైదరాబాద్ లిబరేషన్‌కు సంబంధించి చరిత్రను ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టింది. దీనికి మొదటి దోషి కాంగ్రెస్ పార్టీ.
- ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పాల్పడి, రజాకార్ల వారసుల పార్టీతో కలిసి.. చరిత్రను తెలియనియ్యలేదు.
- 1998లో ఆరోజు విద్యాసాగర్ రావు గారు.. తెలంగాణ చరిత్రను ప్రజల ముందు పెట్టే వరకు ఎవరికీ తెలియదు.
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మేము లిబరేషన్ డే జరపాలని డిమాండ్ చేస్తే.. కొట్టి, జైళ్లలో పెట్టింది.
- ఇలాంటి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17న వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకునే నైతిక హక్కు లేదు.
- కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలో ఉన్నప్పుడు.. హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలకు అధికార పూర్వకంగా హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలు నిర్వహించాయి. మహారాష్ట్రలోనూ వేడుకలు నిర్వహించాయి.
- కానీ తెలంగాణలో ఏరోజూ వేడుకలు నిర్వహించలేదు. చరిత్రను సమాధి చేస్తే.. బీజేపీ దాన్ని బయటకు తీస్తే… భారత ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నది.
- చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర రక్తం కారేలా ముక్కు నేలకు రాసి..ఇక్కడ మీటింగ్ పెట్టుకోండి.
- అధికార బీఆర్ఎస్ పార్టీ.. జాతీయ సమైక్యత దినోత్సవం అంటున్నది.. ఇది ఎలా సమైక్యత దినోత్సవం అవుతుంది కేసీఆర్?
- 80 వేల పుస్తకాలు చదివినవ్ కదా.. ఎలా అవుతుందో చెప్పు?
- వేలాది మంది మహిళలను చెరిచి, ప్రజలను రజాకార్లు కాల్చిచంపితే.. భారత ప్రభుత్వం పోలీస్ చర్య ద్వారా నిజాంను ఓడించి ఇక్కడ జెండా ఎగురవేస్తే.. అది సమైక్యత అవుతుందా?
- అమరవీరులకు నివాళి అర్పించే.. ధైర్యం లేదు కాబట్టే.. సమైక్యత అంటున్నారు.
- కేసీఆర్ నేను సవాలు విసురుతున్నాను.. పరకాల అమరధామం వద్దకు రా.. చర్చకు సిద్ధమా?
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. మేము స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకోవద్దా అని అన్న కేసీఆర్.. ఇప్పుడు సమైక్యత అంటున్నాడు. బీజేపీ ఉత్సవాలు నిర్వహిస్తున్నదని.. ఆగమాగం ప్రగతి భవన్ నుంచి నిద్రలేచి సమైక్యత ఉత్సవాలు అంటున్నాడు.