కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదని, ఈ రెండు పార్టీలు దొంగ రాజకీయాలు చేస్తున్నాయని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో గురువారం ఆయన ముఖ్య కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరు బలహీనమైన అభ్యర్థిని, మరొకరు బలమైన అభ్యర్థి పెడదామని చెప్పి ఉన్నత స్థాయి నాయకుల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోందని ఆరోపిం చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే కలిసి పోటీలో ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మోదీ నాయకత్వంలో 17 పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో బీజేపీ గెలిచే అవకాశం ఉందన్నారు. టైగర్ నరేంద్ర తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి కాషాయ జెండాను ఎగురవేస్తామన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం
by
Leave a Reply