Picsart 24 02 26 19 17 12 052

BRS ఖతం అయిన పార్టీ

Spread the love

సిద్ధిపేట జిల్లా : గజ్వేల్
మెదక్ పార్లమెంట్ పరిధిలో సందర్భంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో సంపూర్ణంగా కొట్లాడాలి, 10కి పైగా స్థానాలు గెలవాలని భావిస్తుంది.
ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 5 క్లస్టర్స్ లో విజయసంకల్ప యాత్ర చేస్తున్నాం.
జహీరాబాద్, కరీంనగర్, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో యాత్ర కొనసాగుతుంది.
యాత్రలో మాకు అనేక ధరకాస్తులు వస్తున్నాయి. మా భూములు ప్రాజెక్టులు కోసం, రోడ్ల కోసం గుంజుకుంటే భరించాం.. కాని ప్రైవేట్ వ్యక్తులకోసం కోసం గుంజుకున్న భూములు వెనక్కు ఇవ్వాలని ఆందోళన కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం ఆ భూములు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న.
గజ్వేల్ లో ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. గెలవగానే లక్ష అదనంగా భూభాదితులకు ఇస్తాం. 18 సంవత్సరాల వయసు పైన భూములు కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తాం.
ఇళ్లకు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని అనేక హామీలు ఇచ్చారు. ఓట్లు డబ్బాల పడే వరకు హామీలు ఇచ్చి, వాటి ఊసే ఎత్తడం లేదు.
కేసీఆర్ ఓడిపోవచ్చు కానీ ఇవన్ని జన్యూన్ డిమాండ్స్ కాబట్టి వాటిని నెవర్చాలని నేనే ఈ ప్రభుత్వానికి దరఖాస్తు ఇస్తా.

మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేశాం.
కానీ ఈ సారి జెండాలు లేవు మోదీ గారికి ఓటు వేస్తాం అని చెప్తున్నారు. మోదీ గారు.
మహిళలకు ఆత్మగౌరవం పెంచే విధంగా టాయిలెట్స్ కట్టించాడు. మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగి మా గౌరవం పెంచారు. రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మించి లైన్లలో నిలబడే బాధలేకుండా ఎరువులు అందించారు. కేంద్రం ఇచ్చే రైతు బంధు టెన్షన్ గా పడుతుంది.
10 లక్షల రూపాయల వరకు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించబోతున్నారు. అంతేకాదు ఈ దేశంలో సుభిక్షంగా, సురక్షితంగా బ్రతకాలి అనే మోదీ గారికి ఓటు వేయాలని ప్రజలందరూ అనుకుంటున్నారు.

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అనేక అక్రమాలు జరిగాయి.
2జి స్పెక్ట్రమ్ స్కాం, కోల్ మైన్ స్కాం, ఫెర్టిలైజర్ స్కాం.. ఇలా అనేక స్కామ్ లలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అయ్యు జైల్లో ఉన్నారు.
కానీ మోడీ గారి హయాంలో ఎక్కడా ఒక్క స్కామ్ లేదు.
మొదటి సారి 273 సీట్లతో గెలిస్తే, రెండవ సారి 303 సీట్లతో బీజేపీ ని గెలిపించారు.
370 రద్దు, రామాలయ నిర్మాణం, మైనారిటీ మహిళలకు వరమైన ట్రిపుల్ తలాక్ రద్దులాంటి ఎన్నో తీసుకువచ్చారు. సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ ను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు.
అందుకే మోదీ గారికి దేశంలో అన్ని వర్గాల అన్ని రకాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.

ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం ఆపి విద్యార్థులను తీసుకువచ్చిన ఘనత మోదీ గారిది.
మన సైనికుడు అభినందన్ పాకిస్థాన్ లో చిక్కుపడితే అల్టిమేటం ఇచ్చి తీసుకువచ్చి భారత జాతి ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ. మన నావీ ఆఫీసర్స్ కి శిక్ష పడితే దౌత్యపరమైన చర్చ జరిపి తీసుకువచ్చారు.
ఒకప్పుడు భారత్ వేరు ఇప్పుడు వేరు.
కరోనా కష్టకాలంలో అమెరికాకు, ప్రపంచానికి వాక్సిన్ అందించారు.

ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి, నేషనల్ హై వేస్, విమానాశ్రయాల నిర్మాణం ఎందులో అయినా బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంది.
మోదీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి భారత దేశం వికసించాలని మేము యాత్ర చేస్తున్నాం.

తెలంగాణ ప్రజలారా మోసపు హామీలు నమ్మవద్దు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదు. ప్రతి మహిళకు 2500, రైతుబంధు 15000 రూ., కౌలు రైతులకు 12 వేలు, ఆటో డ్రైవర్లకు 12 వేలు, మహిళలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏదీ అమలు కాలేదు.
ధరకాస్తుల పేరుతో మళ్ళీ మోసం చేస్తారు జాగ్రత్త.

BRS ఖతం అయిన పార్టీ.

ఈ సారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీనీ గెలిపించి నరేంద్ర మోదీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని కోరుతున్నాను.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *