ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల ప్రవాస భారతీయులు చూపుతున్న అభిమానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. మోదీపై చూపుతున్న అభిమానాన్ని ఓట్లరూపంలో కురిపించాలని కోరారు.
అమెరికా పర్యటనలో ఉన్న సంజయ్ అట్లాంటాలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మోదీపై మీరు చూపుతున్న అభిమానం వెలకట్టలేనిది. మోదీ 9 ఏళ్ల పాలన అవినీతికి తావు లేకుండా కొనసాగుతోంది.
అభివృద్ధిలో భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవాలంటే మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందు కోసం మీరంత సమయం తీసుకుని ఎన్నికల సమయంలో భారత్ రండి. మోదీ తరపున ప్రచారం చేయడంతో పాటు ఓట్లు వేయాలి అని కోరారు. మోదీ పాలనలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను సంజయ్ కోరారు.