మోదీ పాలనలోనే దేశం భద్రంగా ఉంటుందని భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. లోకసభ ఎన్నికల దృష్ట్యా గురువారం చండూరులో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లా డారు. దేశంలో ఉప్పెనలా మోదీకి అభిమాను లు ఉన్నారని చెప్పారు. ఈ సారి కూడా ఢిల్లీలో మోదీ భువనగిరిలో బూర గెలుపు తధ్యం అని ధీమా వ్యక్తం చేశారు. నాకంటే ముందు, తర్వాత ఎంపీ లుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. నా హయాంలో భువనగిరి లోక్ సభ స్థానంలో లక్ష కోట్ల సంపద పెరిగిందని అన్నారు. అదే సమయంలో నా సంపద తగ్గినా కోమటిరెడ్డి ఆస్తులు పెరిగాయని గుర్తు చేశారు. రాబోయే ఎన్ని కల్లో కాంగ్రెస్కు ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదని అధికారంలోకి వచ్చే బీజేపీకి ఓటు వేసి గెలి పించాలని కోరారు. కేంద్రంలో రాహుల్ ప్రధానికావడం ఎంత అతిశయోక్తో, రాష్ట్రంలో ఆరు గ్యా రంటీలు అమలు కావడం కూడా అంతే అన్నారు. వచ్చే ఎన్నికల్లో భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానన్నారు భూర నర్సయ్య గౌడ్. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, లింగోజి గూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు భూర నర్సయ్య, బీఆర్ఎ స్, బీజేపీ రెండూ ఒకటే అన్న వారిని చెప్పుతో కొడ తామని కామెంట్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు గతంలో లేదు భవిష్యత్తులో కూడా ఉండబోదన్నా రు. కాళేశ్వరంపై హంగామా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంటే బీఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు చేయాలని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్రనాయకులు ఎరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం, నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం, జిల్లా నాయకులు కోమటి వీరేశం, జనార్దన్ రెడ్డి నాగార్జున, రావిరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply