బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో వాకర్స్ ని కలిసి ప్రచారం నిర్వహించారు.
కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం కల్పించి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్థించడం జరిగింది.
శ్రీమతి రావు పద్మ గారు “అవకాశం ఇవ్వండి, అభివృధి చేసి చూపిస్తాం. నిజాయితే మా మార్గంగా – అభివృద్దే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న. నన్ను ఆదరించి ఆశీర్వదించండి” అని ప్రజలను కోరారు.