30-10-2023-Chandupatla Keerthi Reddy - Telangana BJP Fans

భూపాలపల్లి నియోజకవర్గం గడప గడపకు బిజెపి ప్రచారంలో బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు

Spread the love

భూపాలపల్లి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు గడప గడపకు బిజెపి ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, బుర్ర వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, గిద్దె ముత్తారం, అందుకు తండా, వెంచిరామి కాల్వపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.

అదేవిధంగా ఆడబిడ్డగా మీ ఇంటి ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి రుణపడి ఉంటాను అని మహిళలతో మాట్లాడడం జరిగింది. రైతులకు, మహిళా సంఘాల సభ్యురాళ్లకు, నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోర్తాల రాజేందర్ గారు, జనరల్ సెక్రెటరీ మాచర్ల రఘు మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉడుత వనక్క, ఓబీసీ మూర్ఛ మండల అధ్యక్షుడు పశ్చిమ మహేష్, మండల కార్యదర్శి నల్ల శ్రీనివాసరెడ్డి, ఎక్స్ సర్వీస్మెన్ శ్రీనివాస రావు గారు, శక్తి కేంద్ర ఇంచార్జ్ సంఘ రఘుపతి, బూత్ అధ్యక్షులు బిస్కుల రవి, కచ్చు కూమార్, మండల నాయకులు నీలం సంజీవరెడ్డి, బానోతు సమ్మక్క, కోత్తపల్లి రమణ, అవుల అయీలయ్య, రమేష్ రాజు, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు