20-10-2023-Featured Image-Sama Ranga Reddy-Sudheer Reddy

సామ రంగారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జాలపై ప్రశ్నించడంతో బిఆర్ఎస్ గూండాల రసాభాస

Spread the love

ఎల్బీనగర్ నియోజకవర్గంలో NTV గెలుపెవరిది కార్యక్రమం సందర్భంగా BJP రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు, శ్రీ సామ రంగారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జా బాగోతాలపై ప్రశ్నించడంతో, సమాధానం చెప్పలేక, అక్కడున్న సుధీర్ రెడ్డి పెంచి పోషించిన తెరాస గూండాలు, బీజేపీ కార్యకర్తలపై కుర్చీలు విసిరి రసాభాస సృష్టించారు.

బీజేపీ నాయకుల వైపు మహిళా నాయకులు ఉన్నారనే కనీస సోయి కూడా లేకుండా, కుర్చీలు విసరడమే కాక, NTV యాంకర్ పదే పదే వారించినా, తెరాస గూండాలు వినకుండా కార్యక్రమానికి అడ్డుతగిలారు.

దీంతో సుధీర్ రెడ్డి కార్యక్రమానికి రాకుండా తన మనుషులతో కార్యక్రమం సజావుగా సాగకుండా చేస్తున్నారని సామ రంగారెడ్డి గారు కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసారు.

సామ రంగారెడ్డి గారు “సుధీర్ రెడ్డి, నువ్వు ఉసిగొల్పుతున్న నీ తెరాస గూండాల దాడులకు బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తే లేదు. నీ అవినీతి బాగోతాన్ని, కబ్జా బాగోతాన్ని ప్రతీ నిత్యం ప్రశ్నిస్తునే ఉంటా. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాన్ని బీజేపీ తరఫున గడప గడపకు వెళ్లి ప్రచారం చేసి నిన్ను ఎల్బీనగర్ నుండి సాగనంపి తీరుతాం.” అని అన్నారు.