In live debate Kuthbullapur BRS MLA KP Vivekanand Goud openly attacked BJP candidate Koona Srisailam Goud

లైవ్ డిబేట్‌లో కుత్బుల్లాపూర్ BRS MLA కేపీ వివేకానంద్ గౌడ్ BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారిపై బహిరంగంగా దాడి

Spread the love

NTv ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? లైవ్ డిబేట్‌లో BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ప్రజా సమస్యలు లేవనెత్తితే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, BRS అభ్యర్థి, కేపీ వివేకానంద్ గౌడ్ వాటికి సమాధానం చెప్పలేక, BJP బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారిపై దుర్భాషలాడుతూ, బహిరంగంగా దాడి చేశారు. ఈ హీనమైన చర్యను వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు.

కూన శ్రీశైలం గౌడ్ గారు తనపై BRS అభ్యర్థి కేపీ వివేకానంద్ గౌడ్ దుర్భాషలాడుతూ చేసిన భౌతిక దాడి గురించి సూరారం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ “బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.” అని అన్నారు.

ప్రజా సమస్యలు, పరిణామాలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం బీఆర్‌ఎస్‌ నేతలకు అలవాటుగా మారింది.

ఎక్కడ చుసిన బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఇదే విధంగా ఉన్నారు.. కొందరు కనపడతరు.. కొందరు కనపడరు.