రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ దరఖాస్తుల స్వీకరణ తొలిరోజు ముగిసింది. ఇప్పటివరకు 300 మందికి దరఖాస్తు ఫామ్లను పంపిణీ చేయగా, తొలిరోజు 63 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 10తో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. LBనగర్ స్థానానికి సామ రంగారెడ్డి, వేములవాడ స్థానానికి తుల ఉమ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
