బిజెపి ఇందిరాపార్క్ ఉపవాస దీక్ష కార్యక్రమంలో శ్రీ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుతూ..
నిరుద్యోగులు యువత వీళ్ళందరూ దీక్షలు చేస్తున్న ధర్నాలు చేస్తున్న చేస్తున్న ధర్నాలు చేస్తున్న ఉద్యమాలు చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నవ్వుకుంటున్నాడు. ఎందుకోసం నవ్వుకుంటున్నాడు..? ఉద్యోగాలు లేవంటుంది నా ఇంట్లోనే.. ఐదు ఉద్యోగాలు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉన్నది, నా బిడ్డకు ఉన్నది, నా కొడుకు ఉన్నది, నా అల్లుడుకున్నది, నా సడ్డకుని కొడుకుకు ఉన్నది, నా చుట్టాలు కూడా ఉన్నాయి… ఇంత ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు లేవు అంటుంన్నరెంద్రి వీళ్ళు? అని అన్నారు.
పచ్చకామర్లు వచ్చిన వానికి ప్రపంచమంతా పచ్చగా కనబడినట్టు, కేసీఆర్ తన ఇంట్లో వాళ్లకి ఉద్యోగాలు ఉంటే రాష్ట్రమంతా ఉన్నట్టేనని భావిస్తున్నరని ఎద్దేవా చేశారు.
సుమారుగా 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చిన అవి తప్పులతడకగా, పేపర్ లీకులతో అవినీతిమయంగా ఉన్నాయని తెలియజేశారు.
ఏ ఉద్యోగ కొరకై తెలంగాణ యువత 10 సంవత్సరాల క్రితం ఉద్యమంలో పాల్గొన్నారో వారందరికీ ఏజ్ బార్ అయిందని తెలియజేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన పర్మనెంట్ చేసే హామీలకు క్లారిటీ లేదు. అటెండర్ నుంచి గ్రూపు వన్ వరకు అంతా అయోమయం. 2014లో నిరుద్యోగులు 2.4% నుండి ఇప్పుడు 9.3% కి పెరిగిందని, పాలిటెక్నిక్ కాలేజీ ఇలలో 70% ఖాళీలు ఉన్నాయని, పాఠశాలల్లో నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, సంక్షేమ శాఖలో 10000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, 58% ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు ఉద్యోగాలు లేవు, కెసిఆర్ కు అవగాహన లేదని వెల్లడించారు.
ఎన్నికలలో మోసం చేసి, డబ్బులు పంచి గెలవడమే తన ధ్యేయంగా దుర్మార్గపు ఆలోచనలతో కేసీఆర్ ఉన్నాడని తెలిపారు.