మరోసారి ఎంపి బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు. ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
మజ్లిస్ మూకల తీరును నిరసిస్తూ కరీంనగర్లో రోడ్లపైకి వచ్చిన బీజేపీ కార్యకర్తలు.
మజ్లిస్ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు. పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడానికి కరీంనగర్ సీపీ కార్యాలయానికి బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు. వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వివాదం ఘర్షణ చోటుచేసుకుంది.
కరీంనగర్ బండి సంజయ్ కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల చర్యను ఖండించిన కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు.
“ఎంఐఎం తాటాకుచప్పుళ్ళకు బండి సంజయ్ భయపడరు. ఎంఐఎం దుందుడుకుచర్యల వలన సమాజం ఏమవుతుంది? శాంతిభద్రతలను కాపాడాల్సినబాధ్యత పోలీసులుదే.” అని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారు అన్నారు.