లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర నాయకత్వం మార్పులు, చేర్పులు చేపట్టింది. రాష్ట్ర మోర్చాల అధ్యక్షులతో పాటు, జిల్లా అధ్యక్షుల ప్రక్షాళన చేపట్టింది. మైనార్టీ మోర్చ్ రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగతా ఆరు మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులుగా కొత్త వారిని నియమించింది. అలాగే 12 జిల్లాల అధ్యక్షులను మారుస్తూ రాష్ట్ర నాయకత్వం గురువారం ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఉన్న టీమ్ తోనే బరిలోకి దిగారు. కానీ ఎనిమిది స్థానాలకే పరిమితం కావడంతో మార్పులు తప్పవని హైకమాండ్ కు పలు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు వీరే..
నిజామాబాద్ = దినేశ్ కుమార్ కులాచారి
పెద్దపల్లి = చందుపట్ల సునీల్
సంగారెడ్డి = గోదావరి
సిద్దిపేట = గంగడి మోహన్ రెడ్డి
యాదాద్రి = పాశం భాస్కర్
వనపర్తి = డి.నారాయణ
వికారాబాద్ = మాధవరెడ్డి
నల్లగొండ = డాక్టర్ వర్షిత్ రెడ్డి
ములుగు = బలరాం
మహబూబ్ నగర్ = పి. శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ = గంట రవి
నారాయణపేట = జలంధర్ రెడ్డి
మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు వీరే..
ఎస్టీ మోర్చా = కల్యాణ్ నాయక్
ఎస్సీ మోర్చా = మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
యువ మొర్చా = సేవెల్ల మహేందర్
ఓబీసీ మోర్చా = ఆనంద్ గౌడ్
మహిళా మోర్చా = డాక్టర్ శిల్ప
కిసాన్ మోర్చా = పెద్దోళ్ల గంగారెడ్డి
Leave a Reply