17 02 2024 04

కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఖండించిన ఈటెల

Spread the love

ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు పార్టీ మారుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుంది అందులో ఏమాత్రం నిజం లేదు.

కొప్పుల నరసింహరెడ్డి, కార్పొరేటర్ గృహప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు కొన్ని ఫోటోలతో రాజకీయ దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ.. “ఒక గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేశా.. కావాలని ఆ ఫోటో పెట్టి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తనపై వచ్చిన ఈ తప్పుడు వార్తను ఖండిచారు.

రాజకీయాలను రాజకీయాల్లో చేయాలి తప్ప ఇలా దుర్మార్గమైన ఆలోచనలతో, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలను ప్రతి ఒక్కరు ఖండించాలి.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *