ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు పార్టీ మారుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుంది అందులో ఏమాత్రం నిజం లేదు.
కొప్పుల నరసింహరెడ్డి, కార్పొరేటర్ గృహప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు కొన్ని ఫోటోలతో రాజకీయ దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ.. “ఒక గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేశా.. కావాలని ఆ ఫోటో పెట్టి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తనపై వచ్చిన ఈ తప్పుడు వార్తను ఖండిచారు.
రాజకీయాలను రాజకీయాల్లో చేయాలి తప్ప ఇలా దుర్మార్గమైన ఆలోచనలతో, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలను ప్రతి ఒక్కరు ఖండించాలి.
Leave a Reply