ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సౌడ రమేష్ గారి ఆధ్వర్యంలో నర్మెట్ట మండలంలోని,నర్మెట్ట గ్రామంలో వరి చేనులకు మొక్కజొన్న చేనులకు నీరు అందక ఎండిపోయినటువంటి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన వలన రైతులకు నీరు అందించలేక ఈరోజు పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని
ఈ ప్రభుత్వానికి రైతులపై ఎటువంటి చిత్తశుద్ధి లేదని ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను అరిగోసలు పెడుతుందని రైతులకు ఇచ్చిన హామీలలో రైతు భరోసా విషయంలో గానీ ,రైతు రుణమాఫీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అంతేకాకుండా కనీసం సకాలంలో రైతులకు నీరు అందించక ఈరోజు పంటలు ఎండిపోవడానికి పూర్తి కారణం ఈ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీయే కారణం అని ఇప్పటికైనా త్వరితగతిన నీరందించి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని మరియు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా ఎకరాకు 50 వేల రూపాయలు రైతులకు అందించాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని ,రైతు దీక్షలు చేపడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి గారు ,రాష్ట్ర నాయకులు దేవరాయఎల్లయ్యగారు,జిల్లా కార్యదర్శి ధరావత రాజు నాయక్, సొక్కం అనిల్ , జిల్లా నాయకులు నవీన్ రెడ్డి, పెద్దోజు జగదీష్,
బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంతోష్ ,
బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మహిపాల్ ,అశోక్ ,నవీన్ కుమార్ ,జహంగీర్, శ్రీనివాస్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు


Leave a Reply