పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం భారత ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా విస్తరించాలన్నారు. ప్రపంచ దేశాల్లో దేశాన్ని ఉన్నతంగా నింపుతున్న మోడీకి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు.మోదీ నాయకత్వంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందేటట్లు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఇంటింటికి మోడీ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలన్నారు. అనంతరం కార్యకర్తలకు విశ్వకర్మ యోజన అవగాహన, నరసన్న భీమా కుటుంబానికి ధీమా పథకం, వికసిత భారత కార్యక్రమాలను గురించి దిశా నిర్దేశం చేశారు. ఆయన వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, ఎల్లబోయిన రవిశంకర్, రామా గౌడ్, నరేష్ చారి, ముఖ్యర్ల గణేష్, భాస్కర్, మండల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యకర్తలు ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
by
Leave a Reply