Beerappa Bezadi with Jangaon Farmers

జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప

Spread the love

జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట ,తరిగొప్పుల, జనగామ రూరల్ మండలాల్లో, విపరీతమైన కరువు కటకాలు కరాల నృత్యం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంత ఓట్లతో గెలిచిన స్థానికేతుడైన శాసన సభ్యుడు గాని అధికార కాంగ్రెస్ పార్టీ గానీ చెరువులు నింపడానికి కానీ, భూగర్భ జలాల పునరుద్ధరణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్పగారు తెలియజేశారు.

గత సంవత్సరం జనగామ ప్రాంతంలో భారీగా కురిసిన వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు సైతం నేటికీ రైతుల ఖాతాల్లో జమ కాకపోవడం సిగ్గుచేటు.. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కరువులు కాటకాల సమయంలో రైతులకు అందించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా రాకుండా అడ్డుకున్న పార్టీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో డిపాజిట్లు రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది.

ఈరోజు ఈ మట్టి కరువుతో అల్లాడుతుంటే పరాయి ఎమ్మెల్యే అయిన పళ్ళ రాజేశ్వర్ రెడ్డి పత్తా లేకుండా పోయిండు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని ఈ ప్రాంత రైతాంగం పై చిత్తశుద్ధి ఉంటే జనగామ కలెక్టర్ ఖాతాలో మగ్గిపోతున్న వడగండ్ల వాన రైతుల డబ్బులు వారి ఖాతాల్లో రాబోయే 48 గంటలలో జమ చేయించాల్సిన బాధ్యత మీపై ఉంది. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎవరు ఏమి చేయలేరు కాబట్టి మీకు రైతుల పక్షాన రెండు చేతులు జోడించి రైతులకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను.. అని  తెలిపారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *