గంగాధర మండలంలోని ఎస్సారెస్పీ కెనాల్ కి తక్షణమే నీటిని విడుదల చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రజాహిత యాత్రలో భాగంగా ఉప్పరమల్యాలలో మాట్లాడుతూ.. శుక్రవారం లోగా నీటిని విడుదల చేయకపోతే బీజేపీ కార్యకర్తలతో కలిసి ధర్నాలు, ర్యాలీలు నిర్వహి స్తామని హెచ్చరించారు. ప్రజల కోసం జైలుకు వెళ్లడం, లాఠీదెబ్బలు తినడం తమకు మామూలే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే 50 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాస్తామని రాహుల్గాంధీ ప్రకటించడంపై స్పందించిన బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోని పదవుల్లో సగం మహిళలకిచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చి నవే అన్నారు. ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలన్నీ పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఎన్నిక లకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కులేద న్నారు. వెంటనే మహిళల ఖాతాల్లో రూ.2,500 వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల కోసం లాఠీదెబ్బలు కొత్త కాదు
by
Leave a Reply