TBF Frames 04

ప్రజల గణపతి ఉత్సవాలు

Spread the love

మామూలుగా పెద్ద పల్లెల్లోనే వినాయక పూజకు అవసరమైన అన్నిరకాల పత్రి దొరుకుతలేదు.. బతుకమ్మకు తంగేడు పూవు కరువైనట్టు.. నిజానికి దేవుడి దగ్గర ఏయే పత్రి పెట్టాలో, ఏయే కాయలు పెట్టాలో చాలామందికి తెలియదు.. నెట్ లో చదివి, ఏ పంతులునో అడిగి ఏదో చేసేయడమే.. నిజంగా పూజావిధాన పుస్తకాల్లో చెప్పిన అన్నిరకాల పత్రి దొరకడం అసాధ్యం.. లేదా, కష్టసాధ్యం.

పట్టణాల్లో ఈ ఒక్కరోజు ఒనగాయ ధర మస్తు పిరం.. పత్రికి వంద రూపాయల ప్యాకేజీ.. ఏవేవో ఆకులు అలములు తెచ్చి అలా మన సంచీలో కుక్కేస్తారు.. తప్పదు మరి.. తలవంచుకుని, తెచ్చేసుకుని, నీకు ఇంతే ప్రాప్తం స్వామీ అని సమర్పించాలి.. కాయలు, కట్టే, చెక్క ఫ్రేమ్ అయితే చాలా ఇళ్లల్లోని పూజల్లో మాయమైపోయింది..

తామరాకు లేదా ఏదైనా పెద్ద ఆకు, అదీ లేకపోతే పచ్చి విస్తరి.. దాంట్లో ప్రతిష్టించి, పసుపు, కుంకుమ, అక్షితలు, ఆకులు, పూలు.. మనకు వచ్చిన అర్చన శ్లోకాలు, పద్యాలు.. మా ఇళ్లల్లో చిన్న కృష్ణుడి కోసం పెట్టినట్టే.. చవితి రోజు బుజ్జి గణేషుడి రాకను ఆహ్వానిస్తూ సున్నం, జాజు వృత్తాలు గీస్తాం.. దేవుడి దగ్గర పెన్నులు, పుస్తకాలు గట్రా తప్పనిసరి.

పెద్ద గణేషుల అమ్మకాలు ఈసారి ఇంకా బాగా తగ్గాయట..


Posted

in

by