దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వందమంది కౌరవులను ఓడించిన పాండవులను స్ఫూర్తిగా బిజెపి కార్యకర్తలు తీసుకొని యుద్ధం చేయండి, గెలుపు మనదే అని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
మీరే నిల్చవాలే, మీరే గీత గీయాలి, అమ్ముడు పోయే వాళ్ళందరూ అటువైపు పోయిండ్రు, మిగిలిందంతా మనమే మిగిలినం. ఊరుకు ఐదుగురి మిగిలినవచ్చు, పాండవుల లెక్క కొట్లాడండి మీరు. కౌరవుల్లాగా వాళ్ళు అందరూ అటుపక్క పోవచ్చు. మిగిలింది మీరు ఐదుగురే కావచ్చు. ఐదుగురు ఒక తాటి మీద నిల్చండి. ఒక్కడే అర్జునుడొక్కడే చాలు. ఊరుకొక్కడు, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు, ఊరుకొక్కడు గట్టిగా నిల్చోండ్రి. ఏ ఊరి కావూరికి మీరే కథానాయకులు అనుకోండి. మీరే ఈటల రాజేందర్ అనుకోండి. మీరే రఘునందన్ రావు అనుకోండి. కనబడుండ్రి, తిరగబడుండ్రి.
– రఘునందన్ రావు