భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు 107 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభారీలను ప్రకటించారు. ఇందులో మంచిర్యాల అసెంబ్లీ ప్రభారీగా BJYM నుంచి శ్రీ నరెడ్ల ప్రవీణ్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది.
నరెడ్ల ప్రవీణ్ రెడ్డి M.Tech పూర్తి చేయడం జరిగింది. గతంలో ABVP కార్యకర్తగా, ఖమ్మం జిల్లా కన్వీనర్ గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, విజయవాడ సిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, హైదరాబాద్ సిటీ టెక్నికల్ సెల్ కన్వీనర్ గా, స్టేట్ టెక్నికల్ సెల్ కన్వీనర్‌గా, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీగా పని చేసి, 8 సంవత్సరాలు పూర్తి సమయ కార్యకర్తగా అంకితభావంతో పని చేశారు.
ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రెండు పర్యాయాలు పని చేశారు. 2020 నుంచి ప్రస్తుతం వరకు BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, భూపాలపల్లి ఇంచార్జ్‌గా పని చేస్తున్నారు..
హుజురబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించిన దళితబందు గ్రామాల్లో (శాలపల్లి, ఇందిరానగర్, తోకలపల్లి, చెల్పుర్) ఇంఛార్జ్‌గా పని చేసి, BRS కంటే లీడ్ తీసుకురావడం జరిగింది.
నరెడ్ల ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ జిల్లా,హుజురాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లె గ్రామం నుంచి అంచెలంచెలుగా ABVP లో ఎదిగి ఇప్పుడు పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.