Picsart 24 03 14 11 33 20 085

రేవంత్ పాలనలో రైతులు ఆగం:- రాణి రుద్రమ రెడ్డి

Spread the love

గత అసెంబ్లీ ఎన్నికల ముందు తాను రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భా లు పలికారని, ఇప్పుడు రైతులకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీని రైతు భరోసా పేరుతో విడుదల చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత తె లంగాణలోని రైతులకు భరోసా లేదని, వారిని జీవితాలను దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టే శారని మండిపడ్డారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో రైతులు పంటలకు నీళ్లు లేక, పొట్ట దశకు వచ్చిన పంటల గింజలు తాలు అయ్యే పరిస్థితి వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో పొట్టకు రాకముందే పొలాలు ఎండిపోయి పశువులు మేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం లో మొత్తం 50 లక్షల ఎకరాల్లో వరి సాగైందని సగం పంటలకు నీటి సరఫరా కావడంలేదని రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి100 రోజులు గడుస్తున్నా కూడా రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12 వేలు లేవు, కౌలు రైతులకు రూ.15 వేలు జాడ లేదని, ఇప్పటి వరకు కూడా రైతు కూలీలను గుర్తించ లేదన్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని రైతు భరోసా గ్యారెంటీ కింద చెప్పారని, ఇప్పటివర కు జీవో విడుదల చేయలేదని మండిపడ్డారు. నిజంగా రైతులకు బోనస్ ఇవ్వాలని ఉంటే వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపీట లు, చిన్నపీటలు వేసుకునే పంచాయతీ తప్ప రైతుల పంచాయతీని పట్టించుకోవడం లేదన్నా రు. వారం రోజులుగా పంటలు ఎండిపోయి రైతులు అరణ్య గోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *