Bezadi Beerappa congratulated two students for being selected as Agni Veer Army Selections

ఇద్దరు విద్యార్థులు అగ్ని వీరులుగా సెలెక్ట్ – అభినందనలు తెలిపిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప

Spread the love

తరిగొప్పుల మండలంలోని జగ్గయ్యపేట చెందిన ఇద్దరు విద్యార్థులు అగ్ని వీరులుగా సెలెక్ట్ కావడంతో భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బేజాడి బీరప్ప గారు ప్రత్యేకంగా అభినందించారు.

దేశ రక్షణకై, దుష్టశిక్షణకై, సదా మాతృభూమి సేవలో అహర్నిశలు కష్టపడి, దేశ ప్రజలకు భద్రత కల్పించే వీరులు అగ్ని వీరులని, మాతృ భూమి సేవ మరువలేనిదని బేజాడి బీరప్ప గారు అన్నారు.

వీరిని ఆదర్శంగా తీసుకుని, జనగామ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అగ్ని వీరులు తయారై.. వీర సనికులుగా మాతృభూమికి తమ సేవలో అందించాలని.. ఈ ఇరువురు విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచారని బేజాడి బీరప్ప గారు కొనియాడారు.



by

Tags: