ఈరోజు ఆంధ్రప్రభ వార్తాపత్రిక, తెలంగాణ మెయిన్ పేపర్లో ఒక ముఖ్యమైన వార్త మొదటి పేజీలో కనబడడం జరిగింది. ఇది పూర్తిగా ఎన్నికల నేపథ్యంలో జారీ అయిన ఎజెండాతో ప్రచురించబడిన వార్తగానే మనము అనుకోవాలి.
అనధికారికంగా అప్రకటిత ప్రగతి భవన్ ధ్రువీ వర్గాలు ధ్రువీకరించిన వార్తగా ప్రకటించిన ఈ వార్త చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తరువాత రూ. 955/-లకు వినియోగదారుడికి అందజేయడం జరుగుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గరిష్టంగా రూ.1,000/-ల సబ్సిడీ ఏ విధంగా ఇస్తుంది అనేది ప్రశ్నార్థకం.
సబ్సిడీ మిగులు రూ. 45/- వినియోగదారుడికి సిలిండర్ తీసుకున్నందుకు ఉచితంగా ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం.
అనధికారిక ప్రకటనగా ప్రచురించబడిన, ప్రగతి భవన్ వర్గాలు ధ్రువీకరించినట్టుగా ఈ వార్త కేవలం ఎన్నికల నేపథ్యంలో జారీ అయిన బిఆర్ఎస్ అజెండాగా మనము అర్థం చేసుకోవాలి.
*పైన ఇవ్వబడిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఆంధ్రప్రభ వార్తాపత్రిక యొక్క ఈ పేపర్ నుండి గ్రహించబడింది. దాని పూర్తి కాపీరైట్ ఆంధ్రప్రభ వార్త పత్రికకి చెందుతుంది.