FB IMG 1668183508606

కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాదే.. గోషామహల్ MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Spread the love

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారు. పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్నారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ మారుస్తానంటే ప్రజలు కేసీఆర్నే మార్చారన్నారు. కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని.. అప్పులు పూడ్చడంతోనే కాంగ్రెస్కు సరిపోతుందన్నారు. తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు.