Eatala Rajender 1

ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్

Spread the love

ధనిక రాష్ట్రం అని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్తున్నారు కదా.. ఒక్కరోజు లిక్కర్ బంద్ చేస్తే ఈ రాష్ట్రం డబ్బులు లేక విలవిలలాడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్ అంటున్నారు కదా.. చర్చకు వస్తావా ? అని సీఎం కేసీఆర్ కు, మంత్రులకు ఈటల సవాల్ విసిరారు.

భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్ సమ్మేళనం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే ప్రపంచం ఆర్థికమాంద్యంతో ఇబ్బందిపడుతున్న భారత్ సగర్వంగా నిలబడిందన్నారు. జై జవాన్ జై కిసాన్.. ఒకరు భరతమాతను రక్షించే వారు.. కాగా, మరొకరు భరత జాతికి అన్నం పెట్టేవారని పేర్కొన్నారు.

‘భూ తల్లిని నమ్ముకొని జీవకోటికి అన్నం పెట్టేవారు రైతు. రైతు వ్యాపార కోణంలో ఆలోచన చెయ్యరు. లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతు వ్యవసాయం ఆపరు. రక్తాన్ని చెమటగ మార్చి మన కడుపు నింపుతున్నారు. రైతు త్యాగమూర్తి. రైతుతో ఊరంతా బ్రతికింది. అక్కున చేర్చుకుంది భూమాత. రైతు జీవితాలు గొర్రెతోక బెత్తెడు అన్నట్టు ఉండే.. కానీ నరేంద్ర మోదీ వచ్చిన తరువాత రైతు జీవితాలు మారాయి. జీనోమ్ యుగంలో టెక్నాలజీ తో అనేక కొత్త రోగాలు వస్తున్నాయి. అందుకె నరేంద్ర మోదీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పిలుపు ఇచ్చారని’ ఈటల గుర్తుచేశారు.

‘దేశ రైతుల్లారా మిల్లెట్స్ పండించండి అని పిలుపు ఇచ్చారు. ఒకప్పుడు చుట్టాలు వస్తేనే వరి అన్నం పెట్టేవారు.. లేదంటే గటక పోసేవారు. కానీ ఇప్పుడు పెద్దల ఇళ్లలో గటక తాగుతున్నారు. పెట్టిన పెట్టుబడి కంటే వచ్చే లాభం తక్కువ కాబట్టే రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక “తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా” చేస్తా అన్నారు.. చేసిండా ? 5 వేల ఎకరాలకు ఒక AEO అన్నారు. ఇచ్చాడా ?’ అని ఈ సందర్భంగా ఈటల ప్రశ్నించారు.

375255986 851373923017420 1048854878702974656 n edited

రైతువేదికలో మా రైతులు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు అన్నారు. ఒక్క నాడన్నా వాటికి తాళాలు తీశారా. రైతు వేదికలలో కోతులు, మేకలు, గొర్రెలు ఉంటున్నాయి.. పత్తాల ఆటలకు కేంద్రాలుగా, దావతులకు అడ్డాలుగా మారాయి. కెసిఆర్ ఆరంభ శూరత్వం తప్ప, చేతల్లో శూన్యం అని ఎద్దేవా చేశారు. ధాన్యం సేకరణకు ప్రతి రూపాయి కేంద్రం ఇస్తుంది. కానీ కేసీఆర్ సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు.

ఉప్పుడు బియ్యం వద్దు తెల్ల బియ్యం ఇవ్వండి అని కేంద్రం చెప్తే.. బియ్యమే కొనడం లేదని కేసీఆర్ దుష్ప్రచారం చేశారని ఈటల రాజేందర్ వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యానికి 6 నుండి 10 కేజీల తరుగు తీశారు. ఎకరాకు ఐదు వేల నష్టం వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేజీ కూడా తరుగులేకుండా కొంటామన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకొనే భాధ్యత తమదన్నారు.
రాష్ట్రం 5 వేలు, కేంద్రం 10 వేలు ఇస్తున్నాయి..

రైతుబంధు పేరుతో కెసిఆర్ ప్రభుత్వం రూ.5,000/- ఇస్తుంటే.. కేంద్రం ఎరువుల సబ్సిడీ కోసం ఎకరానికి రూ.10,000/- ఇస్తుందన్నారు. రైతుబంధు ఇచ్చి వ్యవసాయ పరికరాల మీద ఇస్తున్న సబ్సిడీలు కేసీఆర్ ఎత్తి వేశారని ఆరోపించారు. చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు ఇవ్వనని రైతులను బెదిరించిన ఘనుడు కేసీఆర్. పౌల్ట్రీకి కేంద్రం అయిన తెలంగాణలో కోళ్ల పరిశ్రమ ఆగం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మందు సీసాలతో, డబ్బు సంచులతో కేసీఆర్ ను డీకొట్టలేమని, ఆయన కుటుంబం చేస్తున్న అన్యాయాలపై చర్చ పెట్టాలని కిసాన్ మొర్చాకు సూచించారు. బీజేపీ గెలుపు కిసాన్ మొర్చా మీదనే ఆధారపడి ఉందని. రచ్చబండ దగ్గర, కలుపులు తీసేదగ్గర చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్. పేద రైతులకు, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వాలి తప్ప బెంజ్ కార్లో వచ్చి రైతుబంధు తీసుకొనే వాళ్లకు కాదన్నారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు మనం నిద్రపోవద్దు అన్నారు.


Posted

in

by