Amith Shah criticizing Mamata Benerjee in West Bengal Meeting

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో మమతా దీదీని ఎండగట్టిన అమిత్ షా

Spread the love

కేంద్ర హోం మరియు సహకార శాఖామంత్రి శ్రీ అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ లోక్‌సభలో జరిగిన BJP బహిరంగ సభలో ప్రసంగించారు.

బెంగాల్‌ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా గారు మాట్లాడుతూ, “మీరు పోయినసారి 18 స్థానాలలో బిజెపిని గెలిపిస్తే శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించి ఇచ్చాం. ఇప్పుడు 35 సీట్లు ఇవ్వండి, మేము బెంగాల్‌ను చొరబాటుదారుల నుండి విముక్తి చేస్తాము.

మమతా దీదీ, చెవులు పెద్దగాచేసి నా మాట వినండి, బెంగాల్ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు. బెంగాల్ ప్రజలు 30 నుంచి 35 సీట్లలో కమలం పువ్వుకు ఓటువేసి బిజెపిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు.

మమతా దీదీ, బెంగాల్‌లో మోడీ గారి విధానాలను ప్రజలకు అందించడానికి నిరాకరించారు. మోడీ గారి ప్రజాహిత పథకాలను ఆమె ఆపింది. మోడీ గారి పథకాలు ప్రజలకు చేరితే బెంగాల్ ప్రజలు మోడీకి మద్దతు ఇస్తారని వారు భయపడుతున్నారు.

సందేశ్‌ఖాలీలో ఓటు బ్యాంకు కోసం మమతా దీదీ మహిళలను తీవ్రంగా అవమానించారు. సందేశ్‌ఖలీ సోదరీమణులకు న్యాయం జరగాలి. మమతా దీదీ కాదు, మోదీ జీ మాత్రమే న్యాయం చేయగలరు” అని అన్నారు

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *