రేపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గారు మల్కాజ్గిరిలో రోడ్డు షో నిర్వహిస్తున్న సందర్భంగా మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు మిర్జలగూడ చౌరస్తా నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.3 కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహిస్తారు.
మోదీ గారిని చూసే భాగ్యం కలుగుతుంది. రోడ్డుషోలో పాల్గొనాలని అందరూ భావిస్తున్నారు.
బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అన్ని సర్వేలు మోదీ గారికి ఓటు వేస్తారని చెప్తున్నారు. బిజెపి గెలుపును ఎవరు ఆపలేరు.
డబ్బు, మద్యం, ప్రలోభాలకు ఈసారి తావులేదు. డబ్బున్న వారికోసం బిఆర్ఎస్, కాంగ్రెస్ వెతుకుతున్నారు. రెండు పార్టీలకు ఇప్పటివరకు అభ్యర్థులు లేరు.
దేశం సురక్షితంగా ఉండటానికి, ఆర్థికవ్యవస్థలో మూడవ స్థానానికి ఎదగాలంటే, బాంబుల మోతలు లేకుండా ఉండాలంటే మళ్ళీ మోదీ రావాలని కోరుకుంటున్నారు.
500 ఏళ్ల కల రామమందిరం నిర్మాణం చేసి భారతజాతికి అంకితం చేశారు మోదీ.
కాంగ్రెస్ నాయకుల ఇళ్ళల్లో ఉన్న కుటుంబసభ్యులు కూడా ఈసారి మోదీ గారికే ఓటు వేస్తామని అంటున్నారు.
కాశ్మీర్ లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండా స్వేచ్చగా ఎగురవేస్తున్నం.
మోదీగారి హయాంలో స్కాంలు లేవు.
అభివృద్ధితో పాటు ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారు మోదీ.
తెలంగాణలో 12 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతున్నాం.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 9,38,000 బిఆర్ఎస్, 5,83,000 కాంగ్రెస్, 4,25,000 బిజెపి ఓట్లు వచ్చాయి. గతంలో 2018 శాసన సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 4 లక్షల మెజారిటీ వస్తె.. మూడు నెలల్లోనే బిజెపి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
2018 లో ఎమ్మెల్యే ఎన్నికల్లో 107 స్థానాల్లో బిజెపికి డిపాజిట్ రాలేదు.. కానీ మూడు నెలల్లోనే మోదీ గారి కోసం నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిపించారు.
9 లక్షల ఓట్లు వచ్చినా బిఆర్ఎస్ ఎందుకు ముందుకు రావడం లేదు. అందుకే ఎవరికి ఎన్నిసీట్లు వచ్చినా గెలిచేది బీజేపీనే.
టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ.
మోదీ కంటే ముందు.. రోజుకు 11 కిలోమీటర్ల నేషనల్ హైవే లు వేస్తే ఇప్పుడు 28 కిలోమీటర్ల వేస్తున్నారు.
2014 కంటే ముందు 75 విమానాశ్రయాలు ఉంటే ఇప్పుడు 150 అయ్యాయి.
నేషనల్ హైవే లు, సంస్కృతి సంప్రదాయాలు, అభివృద్ది, ఆత్మగౌరవం అప్పటికే ఇప్పటికే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. మీకు ఓటు వేస్తే ఏం చేయగలరు. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టడం తప్ప.
మోదీగారు మొన్న పఠాన్ చేరులో హామీఇచ్చారు. రెండింతల అభివృద్ది నిధులు ఇస్తామన్నారు..
రాజకీయ పార్టీకి లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఉండవు.
ప్రజలకు సేవచేయడమే లక్షం.
ఫిలాసఫీ ప్రజల కోసం ఉండాలి.
సన్నబియ్యం తెచ్చింది నేను.
కులసంఘాల హాస్టల్స్ తెచ్చింది నేను.
రేవంత్ రెడ్డి ఉద్యమాసమయంలో చంద్రబాబు దగ్గర ఉన్నాడు.
తెలంగాణ ఉద్యమ కారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన వాడు.
మంత్రిగా తెలంగాణ అంతా బాగుచేస్తం కానీ మల్కాజిగిరికి ఏం చేశారు అని అడుగుతున్నారు.. సోయి లేదు.
అధికారం రాగానే కళ్లు నెత్తికి ఎక్కాయి.
నేను చదువుకుంది ఇక్కడే, 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా.
5 ఏళ్లుగా ఎంపీ ఉన్నారు ఒక్కనాడన్న వచ్చారా? ఏమన్నా చేశారా..?” అంటూ.. ప్రతిపక్షాలను ఎండగడుతూ.. కేంద్ర బిజెపి ప్రభుత్వం మరియు ఈటల రాజేందర్ గారు చేసిన మరియు చేస్తున్న ప్రజాహిత పనులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Leave a Reply