పార్టీ తనను గౌరవించలేదన్న జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహిత మని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ వీడిన సందర్భాన్ని ప్ర స్తావిస్తూ ఆయన గతంలో మారినోళ్ల గురించి మా ట్లాడిన వీడియోను లైవ్ చూ చూపించి చురకలు వేశారు. పార్టీని వీడినోళ్లను ఏమంటారో ఆయనే గతంలో చెప్పారు.. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయన కొడుకు మిథున్ రెడ్డి కీ టికెట్ ఇచ్చి గౌరవించిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. బీజేపీలో పోటీ చేసే అభ్యర్థులు లేరని మాట్లాడటం సరికా దన్నారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా, కార్య కర్తల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాహబూబ్ నాగర్ లో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్నారని అరుణ విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాకు పాలమూరు ప్రజల మద్దతు ఉందన్నారు. అశీర్వదిస్తారన్న నమ్మకమూ ఉందని చెప్పారు. దేశం కోసం.. దేశ ప్రజల భవిష్యత్ కోసం జరు తున్న ఎన్నికల్లో.. ఓటు ఎవరికి వేయాలో ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారని, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు అరుణ. నాగర్ కర్నూల్ మోదీ సభ తర్వాత మహబూబ్ నగర్ ప్రజలు, పార్టీ కార్యక ర్తల్లో నూతన ఉత్సాహం మొదలైందని తెలిపారు. బుధవారం నుంచి నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు, చేరికలుంటాయి వెల్లడించారు.
బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ
by
Tags:
Leave a Reply