అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోది.. ప్రతి ఒక్కరి కోసం ఆలయాన్ని నిర్మించాం. ..దేవుడి దయ, అందరి సహకారం, అబుదాబి పాలకుల ఔదార్యం, సాధువుల ఆశీర్వాదం, ప్రధాని మోదీ సహకారంతో నిర్మాణం చేపట్టామంటూ….. ఆలయ ప్రారంభోత్సవం అందరికీ ఓ వేడుక లాంటిది” అని BAPS స్వామినారాయణ్ మందిర్ సాధువు బ్రహ్మ విహారిదాస్ తెలిపారు.
ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక ప్రారంభించిన ఈ ఆలయంలోకి మార్చి 1 నుంచి ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు. ఏడు దేశాల కలయికతో అరబ్ ఎమిరేట్స్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిని ప్రతిబింబించేలా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు.
అబుదాబి-దుబాయ్ హైవే సమీపంలో 55 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దది. ఈ ఆలయాన్ని 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో డైనమిక్స్‌లో నిర్మించారు.
రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. స్వామినారాయణ పాదాల వద్ద పూల రేకులను సమర్పించారు ప్రధాని మోదీ. మహంత్ స్వామిమహారాజ్ పాదాలకు నమస్కరించారు మోడీ.
Leave a Reply