మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు హైదరాబాద్ లోని సఫిల్ గూడలో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా భాద్యతలు చేపట్టాక భారతదేశ రూపురేఖలు మారాయి. టెర్రరిస్టుల బాంబుమోతలు లేవు. పుల్వామా దాడి చేసిన టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్ చేసి ఇటుకతో కొడితే రాయితో కొడతాం అని హెచ్చరించారు.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ కూడా భారత్ లో ఉండాలని కోరుకుంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి మన విద్యార్థులని తీసుకువచ్చిన ఘనత మోదీది.
అబ్దుల్ కలాంను రాష్ట్రపతి హోదాలో వెళితే అవమానినించిన అమెరికా ఇప్పుడు రెడ్ కార్పెట్ పరుస్తుంది.
ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ లీడర్ నరేంద్ర మోడీ.
కరోనా సమయంలో మోదీ గారు ప్రజల్లో ధైర్యం నింపి కాపాడారు. అప్పటినుండి ఇప్పటివరకు పేదలకు ఉచితంగా బియ్యం అందించారు. ప్రపంచానికి వాక్సిన్ అందించారు.
హైదరాబాద్ లో డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయి అరికట్టాల్సిన భాద్యత ప్రభుత్వాలది. ప్రజల టెన్షన్ తీర్చాల్సింది ప్రభుత్వాలు. విదేశీరాజులు మన రామమందిరాన్ని ధ్వంసం చేశారు. 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆలయనిర్మాణం చేసి మనకు అంకితం చేసిన వారు మోదీ.రామాయణ మహాభారతాలు మానవసంబంధాలు పెంపొందించడానికి సోపానాలు. వాటిని పాటించబట్టే భారతదేశం కలిసిఉంది.
మోదీ గారికి కుటుంబంలేదు. దేశ ప్రజలే ఆయన కుటుంబం. మచ్చలేని పాలన అందిస్తున్నారు. మోదీపాలనలో స్కాంలు లేవు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేది. బీజేపీ పాలనలో అది 5 స్థానానికి వచ్చింది. 3 స్థానానికి తీసుకురావడమే మోదీ లక్ష్యం. అందుకు 370 స్థానాలు అందించండి ఇంకా సుస్థిర పాలన అందిస్తాం అని మోడీ అంటున్నారు. వాటిలో మల్కాజిగిరి ఉండాలని కోరుకుంటున్న.
BRS అక్కడ ఇక్కడ లేదు ఓటు వేసిన వేస్ట్. కాంగ్రెస్ 44 స్థానాలు లేవు. మళ్ళీ వచ్చే అవకాశం లేదు. సిట్టింగ్ ఎంపీ ఇప్పడున్న సీఎం ఈ నియోజకవర్గానికి ఏమన్నా చేశాడా ? ఎప్పుడన్నా వచ్చాడా?
ప్రధానిగారు రేపు మల్కాజ్గిరికి వస్తున్నారు. మీరందరూ వచ్చి ఆయనకు స్వాగతం పలకాలని కోరుతున్న.
నేను మీకు మచ్చ తేను, మీరు గర్వపడేలా పనిచేస్తా. మీకు ఏ ఆపదవచ్చినా అండగా ఉంటా. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి” అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Leave a Reply