భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం, బాంచన్ దొర నీ కాల్మొక్కుతా నుంచి బరిగీసి కొట్లాడే వరకు.. తెలంగాణ మట్టిలో, తెలంగాణ నేలలో, తెలంగాణ గడ్డి పరకలో కూడా ధీరత్వం.. వీరత్వం.. ఎదిరించే తత్వం.. ఈ నేలకు, ఈ మట్టికి, ఈ గాలికి ఉన్నదనేది అక్షర సత్యం.
1946 నుండి 1951 వరకు తెలంగాణ ప్రాంతంలో.. మరీ ముఖ్యంగా నాటి ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో జరిగినటువంటి అద్భుతమైన పోరాటమే.. చరిత్ర బాటన దాగిఉన్న సత్యాలే.. ఈ సాయిధ రైతాంగ పోరాటం.
ఈ పోరాటం కోసం, ఈ భూమి కోసం, ఈ భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం.. అసువులుబాసిన వీరులెందరో.. గర్భశోకాలు మిగిలిన తల్లులెందరో.. వారందరినీ ఒకసారి స్మరించుకోవలసిన నేటి తెలంగాణ ప్రతి సమాజం ముందు మరొకసారి ఆవిష్కృతం కాబోతుంది.
ఎందుకంటే.. మహిళలను, ప్రతి వర్గాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసినటువంటి రజాకార్ వ్యవస్థ, ఈ తెలంగాణ పల్లెల్లో దోచుకుని, తెలంగాణ పల్లెలు సంపదను దాచుకొని ఏడవ నిజం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రైవేట్ సైన్యంగా ఉన్నటువంటి రాజాకార్ వ్యవస్థ, సాగించిన ఆగడాలు, ఈ నేలపై దీనిపై ఇంతా.. అంతా.. కాదు.
దీనిపైన వేసినటువంటి విచారణ కమిటీలు గాని.. దీనిపై వేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు గాని.. ఇప్పటి వరకు కూడా, సరైనటువంటి నివేదికలు కానీ, ఈ విజయాలను గాని, సభ్య సమాజం ముందు నిలబెట్టకపోవడం ఈ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని పేను ప్రమాదంలో పడినట్లు అయింది.
నేటి పాలకులు కూడా.. సమైక్యతా దినం పేరుతోటి “ఎంఐఎం” మెప్పుకోసం పాకులాడడం తప్ప ఈ ప్రాంత చరిత్రను గ్రంధస్వరూపంలోనికి తీసుకొచ్చి భావితరాలకు అందించాల్సినటువంటి సోయి ఇక్కడి పాలకులకు లేకపోవడం ఈ ప్రాంత ప్రజల దౌర్భాగ్యం.