హోంగార్డు రవీందరును పరామర్శించిన కిషన్ రెడ్డి

ఆస్పత్రిలో హోంగార్డు రవీందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.

హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలని డిమాండ్ చేశారు.

హోంగార్డులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని సీఎం అసెంబ్లీలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

హోంగార్డు కుటుంబాలు జీతాలు, అందక రోడ్డున పడుతున్నాయన్నారు.